బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 14:44:09

రియా కాల్‌ రికార్డులో ‘ఏయూ’..ఆ వ్యక్తి ఎవరు..?

రియా కాల్‌ రికార్డులో ‘ఏయూ’..ఆ వ్యక్తి ఎవరు..?

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియాచక్రవర్తితోపాటు సోదరుడు శోవిక్‌, తండ్రి ఇంద్రజిత్‌, మాజీ మేనేజర్‌ శృతి మోడీ, సిద్దార్థ్‌ పితానిని విచారించారు. దర్యాప్తులో భాగంగా రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి ఫోన్లను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే రియా చక్రవర్తి కాల్‌ రికార్డులో ఓ అనుమానాస్పద పేరును ఈడీ అధికారులు గుర్తించారు.

రియా కాల్‌ చేసిన ఓ ఫోన్‌ నంబర్‌ ఏయూ పేరుతో ఉందట. అయితే ఏయూ ఎవరనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయగా..అది అన్నయ ఉద్ధస్‌ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ నంబర్‌ అని, ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని నిర్దారణకు వచ్చారని తెలుస్తోంది. సుశాంత్‌ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo