టాలీవుడ్ (Tollywood) హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ డైరెక్ట్ (Puri Jagannadh) చేస్తున్నాడు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత లైగర్ టీం ప్రేక్షకులకు హాయ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లోవైరల్ అవుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ కోసం యూఎస్ఏలో ఉంది లైగర్ టీం.
ఇటీవలే లాస్ వెగాస్ షెడ్యూల్ పూర్తి చేసిన బృందం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ ను షురూ చేసింది. లాస్ వెగాస్ షెడ్యూల్ లో మైక్ టైసన్ పార్టును పూర్తి చేశారు. లాస్ ఏంజెల్స్ లో విజయ్ దేవరకొండ, అనన్యపాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. లైగర్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే (Ananya Panday) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఓ వైపు పాన్ ఇండియా కథ కావడం, మరోవైపు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు,తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్