సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 11:42:29

ఒత్తిడిగా ఫీలైతే ర‌జినీకాంత్ సినిమాలు చూస్తా

ఒత్తిడిగా ఫీలైతే ర‌జినీకాంత్ సినిమాలు చూస్తా

బ‌స్ కండ‌క్ట‌ర్ గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించి వ‌ర‌ల్డ్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ర‌జినీకాంత్. ర‌జినీకాంత్ ను తలైవా, సూప‌ర్ స్టార్ గా అభిమానులంతా ముద్దుగా పిలుచుకుంటారు. ర‌జినీకాంత్  అంటే కేవ‌లం సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే కాకుండా క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌ల‌కు కూడా స్ఫూర్తి. టీమిండియా మాజీ ఆట‌గాడు జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ ర‌జినీకాంత్ కు వీరాభిమాని.

ఐసీసీ మ్యాచ్ రెఫ‌రీగా ఉన్న శ్రీనాథ్ ఇటీవ‌లే ఓ టాక్ షోలో ర‌జినీకాంత్ గురించి మాట్లాడుతూ..త‌న‌కెప్పుడైనా నిరుత్సాహంగా అనిపించినా..జీవితంలో ఒత్తిడిగా ఫీలయినా వెంట‌నే ర‌జినీకాంత్సినిమాలు చూస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ర‌జినీకాంత్ గొప్ప మాన‌వ‌త్వం క‌లిగిన వ్య‌క్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం క‌లిగిన మ‌నిషి అని త‌న జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ చెప్పాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo