ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 17:57:14

పాల్ వాక‌ర్ ను విన్ డీజిల్ ఒప్పించాడ‌ట‌

పాల్ వాక‌ర్ ను విన్ డీజిల్  ఒప్పించాడ‌ట‌

త‌న యాక్టింగ్ స్కిల్స్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు హాలీవుడ్ స్టార్ పాల్ వాక‌ర్. ఎంతోమంది ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల్సిన ఈ న‌టుడు అమెరికాలో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. పాల్ వాక‌ర్ వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్ లో న‌టించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్ప‌టికే చాలా  సినిమాలు వ‌చ్చాయి. అయితే నాలుగో సిరీస్ లో న‌టించాల‌ని అడిగిన‌పుడు పాల్ వాక‌ర్ కాస్త సందేహంలో ప‌డ్డాడ‌ట‌.

2015లో లాస్ ఏంజెల్స్ టైమ్స్ లో ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం..ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ వ‌చ్చిన ద‌శాబ్దం కాలం త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి జోన‌ర్ లో సినిమాల‌కు కాలం చెల్లింద‌ని పాల్ వాక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడ‌ట‌. వాళ్లు (మూవీ టీం స‌భ్యులు)నాలుగ‌వ ప్రాంఛైజీ కోసం న‌న్ను అడిగిన‌పుడు..మీకు నిజంగా నాపై జోకులు వేస్తున్నారా..? అని పాల్ వాక‌ర్ అన్నాడ‌ని క‌థ‌నంలో సారాంశం. ప్ర‌ధానంగా యూత్ ను ఆక‌ట్టుకునేలా మొద‌టి పార్ట్ ను తీశాం. 9 ఏండ్ల విరామం త‌ర్వాత నాలుగో ప్రాంఛైజీ  (ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్-4 ) ని చూసేందుకు మ‌ళ్లీ ప్రేక్ష‌కులున్నారా..? అని ప్ర‌శ్న‌లు తలెత్తిన‌ట్లు పాల్ వాక‌ర్ పేర్కొన్నారు. అయితే కోస్టార్ విన్ డీజిల్ ఈ సినిమాలో న‌టించాల‌ని కోర‌డంతో పాల్ వాక‌ర్ ఒప్పుకున్నాడ‌ట‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo