బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 12:40:58

ఫేవ‌రేట్ హీరోకు పెళ్ళి కావ‌డంతో ఏడ్చేసిన మంచు ల‌క్ష్మీ!

ఫేవ‌రేట్ హీరోకు పెళ్ళి కావ‌డంతో ఏడ్చేసిన మంచు ల‌క్ష్మీ!

సినీ ల‌వ‌ర్స్‌కే కాదు సినీ సెల‌బ్రిటీస్‌కు కూడా ఫేవ‌రేట్ స్టార్స్ ఉండ‌డం కామ‌న్ . మోహ‌న్ బాబు న‌ట వార‌సురాలు మంచు ల‌క్ష్మీకి హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్, తెలుగులో కింగ్ నాగార్జున ఫేవ‌రేట్ అని చెప్పుకొచ్చింది. అంత‌టితో ఆగ‌క త‌న ఫేవ‌రేట్ స్టార్ ఆమిర్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నట్టు  చెప్పుకొచ్చింది. ఆమిర్‌కు రెండు సార్లు పెళ్లి కాగా, రెండు సంద‌ర్భాల‌లోను చాలా బాధ‌ప‌డ్డాడ‌ని పేర్కొంది.

ఆమిర్ ఖాన్ సినిమాల‌ని ఎంచుకునే విధానం నాకు చాలా బాగా న‌చ్చుతుంది. ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తాయ‌ని స్ప‌ష్ట చేసింది మంచు వార‌మ్మాయి. న‌టిగా, నిర్మాత‌గా,హోస్ట్‌గా అలిర‌స్తూ వ‌స్తున్న మంచు వార‌మ్మాయి స‌రోగ‌సీ ద్వారా బేబికి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.


logo