శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 14:29:42

ప్రియా వారియర్ అనుకునేరు

ప్రియా వారియర్ అనుకునేరు

ప్రియా ప్రకాశ్ వారియర్..ఒరు ఆదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టి యువత మనసు దోచేసిన ఈ నటి అందరికీ  గుర్తుండే ఉంటుంది. సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రియాప్రకాశ్ కన్నుగీటిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సీన్ ను డబ్ స్మాష్ చేశారంటే వీడియోకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలుస్తుంది. ఇదే సీన్ ను మరో అందాల నటి దిశాపటానీ కూడా ట్రై చేసింది..

దిశా ఈ సీన్ ను ట్రై చేసింది అనే కంటే అచ్చు ప్రియా వారియర్ లాగే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. పైనున్న స్టిల్ చూస్తే అందరూ అవును కరెక్టే అంటారు. ప్రియా వారియర్ లా దిశాపటానీ ఓ యాడ్ కోసం స్కూల్ యూనిఫాం వేసుకుని కన్నుగీటిన త్రోబ్యాక్ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo