బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 21:29:01

ఆ శుక్రవారం ఎప్పుడొస్తుందో..!

ఆ శుక్రవారం ఎప్పుడొస్తుందో..!

శుక్రవారం వచ్చిందంటే చాలు..సినిమా పరిశ్రమలో, సినీ ప్రియుల్లో ఎక్కడా లేని ఉత్సాహం. ఇక థియేటర్లు కొత్త పెళ్లికూతురులా ముస్తాబవుతాయి. హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు, థియేటర్లల్లో అభిమానుల కోలాహలం. అబ్భో శుక్రవారం సందడే వేరుగా వుంటుంది. ఆ రోజు మార్ని్ంగ్‌ షో చూస్తే వచ్చే కిక్కు వేరుగా వుంటుంది. సినిమా చూసి బయటకి రాగానే సినిమా ఎలా వుంది అని అడుగుతున్న జనాల ఉత్సాహం, యూ ట్యూబ్‌ ఛానెల్స్‌ పబ్లిక్‌టాక్‌లు,

వెబ్‌సైట్‌ల రివ్యూలు.. ఇలా ఎంతో సందడి సందడిగా అనిపించే శుక్రవారం మనకు కనిపించి దాదాపు 110 రోజులైంది. సినీ ప్రియులంతా ఆ శుక్రవారం గురించి వెయిటింగ్‌... కానీ కరోనా మహామ్మారితో శుక్రవారం కళ తప్పింది..ఆ శుక్రవారం మళ్లీ నూతన ఎనర్జీతో రావాలి...అందరం సందడిగా మారిపోవాలని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు.logo