శుక్రవారం 15 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 14:47:38

కాల్ వ‌స్తే మ‌హేశ్ ఇంట్లో ల్యాండ్ అవుతా

కాల్ వ‌స్తే మ‌హేశ్ ఇంట్లో ల్యాండ్ అవుతా

టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి-సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అనిల్ రావిపూడికి ఓ మెమొరీలా నిలుస్తోంది. ఎందుకంటే త‌క్కువ‌కాలంలోనే మ‌హేశ్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం కొట్టేశాడు. అయితే మ‌ళ్లీ ఎప్పుడైనా మ‌హేశ్ తో సినిమా చేయ‌డానికి రెడీ అంటున్నాడు అనిల్‌. ఇవాళ అనిల్ రావిపూడి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా గతేడాది స‌రిలేరు నీకెవ్వ‌రు సెట్స్ లో అనిల్ పుట్టిన‌రోజు వేడుక నిర్వ‌హించిన ఫొటోను మ‌హేశ్ ట్వీట్ చేస్తూ..విషెస్ చెప్పాడు.

ఈ నేప‌థ్యంలో మ‌హేశ్‌-అనిల్ కాంబోలో మ‌రో సినిమా వ‌స్తుంద‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..మ‌హేశ్ బాబును డైరెక్ట్ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటా. ఆయ‌న నుంచి ఒక్క ఫోన్ కాల్ వ‌స్తే చాలు..వెంట‌నే మ‌హేశ్ ఇంట్లో ల్యాండ్ అయి క‌థ వినిపిస్తా. కానీ మహేశ్ నాకు మ‌ళ్లీ ఎప్పుడు అవ‌కాశ‌మిస్తారో తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఈ  డైరెక్ట‌ర్ఎఫ్‌3 సినిమాను డిసెంబ‌ర్ 14 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహ‌లు చేస్తున్నాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.