శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 11:23:39

వీల్ చైర్‌లో క‌పిల్ శ‌ర్మ‌.. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధ‌న‌లు

వీల్ చైర్‌లో క‌పిల్ శ‌ర్మ‌.. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధ‌న‌లు

బాలీవుడ్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ ముంబై ఎయిర్ పోర్ట్‌లో వీల్ చైర్‌లో కూర్చొని క‌నిపించి షాక్ ఇచ్చాడు.  వీల్ చైర్‌లో కూర్చున్న అత‌నిని వేరొక వ్య‌క్తి తీసుకెళుతుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్స్ క్లిక్‌మనిపించారు. ప్ర‌స్తుతం అత‌ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే క‌పిల్ శ‌ర్మ‌కు ఏమైంద‌నే విష‌యంపై క్లారిటీ లేదు.

2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో గిన్ని చరాత్‌ను వివాహం చేసుకున్న క‌పిల్ శ‌ర్మ  2019 డిసెంబర్‌లో కూతురు అనైరా శర్మకు జ‌న్మ‌నిచ్చారు, ఫిబ్ర‌వ‌రి 1,2021న త‌మ‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించారని తెలియ‌జేశారు. కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్‌ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు.


VIDEOS

logo