ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 15:51:18

సాయిపల్లవి చేతికి వుడెన్‌ హ్యాండ్‌ చైన్‌..సీక్రెట్‌ ఏంటో..?

సాయిపల్లవి చేతికి వుడెన్‌ హ్యాండ్‌ చైన్‌..సీక్రెట్‌ ఏంటో..?

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రంతో అందరి మనసులు దోచేసింది తమిళ బ్యూటీ సాయిపల్లవి. తరచూ సంప్రదాయక వస్ర్తాల్లో కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది ఈ అందాల తార. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్‌ ఉంటుందని తెలిసిందే. సాయిపల్లవికి కూడా ఓ సెంటిమెంట్‌ ఉందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టే ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. సాయిపల్లవి ఏ కాస్ట్యూమ్స్‌లో కనిపించినా ప్రతీ ఫొటోలో కామన్‌గా కనిపించేది రుద్రాక్షలా ఉండే వుడెన్‌  హ్యాండ్‌ చైన్‌ (చెక్క చేతి గొలుసు). సాయిపల్లవి ఎక్కడికెళ్లినా, ఎంత బిజీగా ఉన్నా చేతికి వరుసలుగా చుట్టబడి ఉన్న వుడెన్‌ చైన్‌ మాత్రం ఉంటుంది.

సాయిపల్లవి ఏ ఫొటో చూసినా ఈ చైన్‌ కనిపిస్తుంది. మరి సాయిపల్లవి ప్రత్యేకంగా ఈ వుడెన్‌ హ్యాండ్‌ చైన్‌ పెట్టుకోవడం వెనక సీక్రెట్‌ ఏమైనా ఉందో తెలియాలంటే..సాయిపల్లవి నుంచి దీనిపై రియాక్షన్‌ వస్తే తెలుస్తుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo