శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 14:16:36

ప‌వ‌ర్ స్టార్ పోస్ట‌ర్స్ చూసాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియాక్ష‌న్ .. ?

ప‌వ‌ర్ స్టార్ పోస్ట‌ర్స్ చూసాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియాక్ష‌న్ .. ?

ప్ర‌ముఖ‌ల జీవితాల‌పై బ‌యోపిక్‌లు తీసి సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో దిట్ట రామ్ గోపాల్ వ‌ర్మ‌. లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న వర్మ‌.. ప‌వ‌ర్ స్టార్ పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీవితంపై ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులోని పాత్ర‌లు ఓ వ్య‌క్తి మాదిరిగా ఉండ‌డం యాదృచ్చికంగా జ‌రిగింద‌ని చెప్పుకొచ్చాడు. కొద్ది రోజులుగా ప‌వ‌ర్ స్టార్ చిత్రంలోని ప్ర‌ధాన పాత్రధారికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేయ‌గా, వీటిపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 

అయితే ప‌వ‌ర్ స్టార్ సినిమా పోస్ట‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చిన‌ట్టు తాజా స‌మాచారం. పోస్ట‌ర్స్ చూసిన ప‌వ‌న్.. ఆర్జీవిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌కుండా చిన్న చిరున‌వ్వు న‌వ్వార‌ట‌. ఆర్జీవీ కొంటె వేషాలు అతడికి నిజంగానే నవ్వు తెప్పించాయిట. ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం  వ‌ర్మ‌ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కాగా, `పవర్ స్టార్` చిత్రానికి `ఎన్నికల ఫలితాల  తర్వాత  కథ` అనేది ట్యాగ్ లైన్ కాగా, ఇది చిత్ర క‌థను రివీల్ చేస్తోంది. జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసిన రెండు స్థానాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఓడిపోగా, దీని చుట్టే సినిమా క‌థ‌ని అల్లిన‌ట్టు ఉప‌శీర్షిక బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo