శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 19:26:48

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ చెన్నైలో ఏం చేస్తున్నారు..?

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ చెన్నైలో ఏం చేస్తున్నారు..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చెన్నైలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ తో బిజీగా కావాల్సిన ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు చెన్నైలో ఏం చేస్తున్నారంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇంత‌కీ వీళ్లు ఏం చేస్తున్నార‌నే దానిపై అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ప‌నుల కోసం చెన్నైకి వెళ్లిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ఆట్లీతో క‌థా చ‌ర్చ‌ల్లో భాగంగా ఎన్టీఆర్ చెన్నైలో ఉండ‌గా..మ‌రోవైపు ఉపాస‌న కామినేని త‌ల్లి శోభ‌న 60వ పుట్టిన‌రోజు వేడుక‌ల కోసం చ‌ర‌ణ్ చెన్నై వెళ్లాడ‌ట‌.

ఉపాస‌న సోద‌రి, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి గెట్ టు గెద‌ర్ పార్టీలో పాల్గొననున్నాడు. రాంచ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఆచార్య‌చిత్రంలో స్పెష‌ల్ రోల్ లో న‌టించేందుకు రాజ‌మౌళి అనుమ‌తి కూడా తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు తార‌క్‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.