మెగాఫ్యామిలీలో ఉన్న యువ నటీనటుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాంచరణ్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తుంటారు. వీరిలో మెగాడాటర్ నిహారికతో అందరూ మంచి బాండింగ్ కొనసాగిస్తుంటారు. ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ లో నిహారికను అభిమాని ఓ ప్రశ్న వేశాడు. వైష్ణవ్ తేజ్ పేరును మీ ఫోన్ కాంటాక్ట్ నేమ్స్ లో ఏమని ఫీడ్ చేసుకున్నారు అని నిహారికను అడిగాడు.
దీనికి నిహారిక స్పందిస్తూ..వైష్ణవ్ తేజ్ పేరును హీరోబాబు అని సేవ్ చేసుకున్నట్టు చెప్పింది. ఉప్పెన సినిమా విడుదల కాకముందే నేనిలా సేవ్ చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. నిహారిక ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి పాండిచ్చేరిలో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మెగా డాటర్ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కు సంతకం చేసింది. దీంతోపాటు మరో వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు రెడీ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్