ప్రథమే నార్జితా విద్యా
ద్వితీయే నార్జితా ధనం
తృతీయే నార్జితా జ్ఞానం
చతుర్థే కిం ప్రయోజనం
జీవితంలోనీ వంద సంవత్సరాలలో.. మొదటి ఇరవై ఐదేండ్లలో విద్యను, రెండవ ఇరవై ఐదు సంవత్సరాల్లో ధనాన్ని, మూడవ ఇరవై ఐదు సంవత్సరాలలో జ్ఞానాన్ని సంపాదించడంలో విఫలమై నాల్గవ 25 సంవత్సరాలు చింతించడం ఏల? జీవితంలోని వివిధ దశల్లో చేయవలసిన పనులను ఆయా కాలాల్లోనే చేయాలి. లేనట్లయితే వాటిని తిరిగి సముపార్జించటం కుదరదు. జీవితంలో ఏ కాలంలో చేయవలసిన పనులను ఆ కాలంలో చేయకుండా ఉంటే జీవిత చరమాంకంలో దుఃఖాల పాలవుతామనే జీవిత సత్యాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నది.
టి.సుధాకరశర్మ