కోలీవుడ్ భామ (Kollywood) శృతిహాసన్ (Shruti Haasan) మంచి నటి మాత్రమే కాదు సూపర్ సింగర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ తొలినాళ్లలో ఓ వైపు తన గాత్రంతో మ్యాజిక్ చేస్తూనే..మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది శ్రుతి హాసన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ నెట్టింట్లో తాజాగా ఓ త్రోబ్యాక్ స్టిల్ (Throwback memory) పోస్ట్ చేసి..తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
బ్లాక్ అండ్ రోజ్ కలర్ డ్రెస్ లో ఉన్న శృతిహాసన్ భుజాన తబల పట్టుకుని మ్యూజిక్ మూడ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది. నేను 21 సంవత్సరాల వయస్సున్నపుడు ఇలా ఉన్నాను. మొదట ఏదైనా జరుగుతుందనుకున్నా. కానీ వేచి ఉండండి..నేను ఇంకా ఎదగలేదు. నాకు నేను పరిష్కరించుకోవాల్సిన చిక్కు ఇది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. శృతిహాసన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆన్ లైన్లో హల్చల్ చేస్తోంది.
శృతిహాసన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో రవితేజతో కలిసి నటించిన క్రాక్ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరోవైపు వకీల్‌సాబ్ లో పవన్ కల్యాణ్ కు జోడీగా మెరిసింది. ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్ లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు లాభం సినిమాలో కూడా నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!