e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Seetimaarr| ‘సీటీమార్’ ఓపెనింగ్స్ ఓకే..మరి లాంగ్ రన్ సంగ‌తేంటి..?

Seetimaarr| ‘సీటీమార్’ ఓపెనింగ్స్ ఓకే..మరి లాంగ్ రన్ సంగ‌తేంటి..?

గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamannaah) జంటగా సంపత్ నంది తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ సీటీమార్‌ (Sampath Nandi). వినాయక చవితి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కథ రొటీన్ గానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు సంపత్ నంది. దానికితోడు పక్కా మాస్ సినిమా కావడంతో ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు.

తాజాగా ఈ చిత్ర తొలి వీకెండ్ వసూళ్లు బయటికి వచ్చాయి. అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఏపీలో కేవలం మూడు షోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నా.. కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఓవర్సీస్ లో పరిస్థితుల ప్రభావంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు నిర్మాతలు. అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా 6.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సీటీమార్. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రానటువంటి భారీ వసూళ్లు సీటీమార్ సాధించింది. బాలీవుడ్ లో విడుదలైన సినిమాలకు కూడా సీటీమార్ రేంజ్ వసూళ్లు రాలేదు. స్పోర్ట్స్ డ్రామాకు సోషల్ ఇష్యూను ముడిపెడుతూ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి సీటీమార్ ప్రాంతాల వారిగా వసూళ్లు ఓ సారి చూద్దాం..

- Advertisement -

ప్రాంతాల వారిగా వసూళ్లు

నైజాం: 1.81 కోట్లు
సీడెడ్: 1.23 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.73 కోట్లు
ఈస్ట్: 0.64 కోట్లు (6 లక్షలు హైర్స్)
వెస్ట్: 0.36 కోట్లు
గుంటూరు: 0.76 కోట్లు (11 లక్షలు హైర్స్)
కృష్ణా: 0.37 కోట్లు
నెల్లూరు: 0.34 కోట్లు (5 లక్షలు హైర్స్)

ఏపీ + తెలంగాణ: 6.35 కోట్లు షేర్ 
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 0.32 కోట్లు
వరల్డ్ వైడ్: 6.67 కోట్లు షేర్

సీటీమార్ సినిమాకు రూ. 11.5 కోట్ల బిజినెస్ జరిగింది. గోపీచంద్ ప్రస్తుత మార్కెట్‌కు అది తక్కువే కానీ బయట పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బిజినెస్ చేసారు. మూడు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 6.60 కోట్ల షేర్ వచ్చింది. ఇంకో 5 కోట్లకు పైగా వస్తే కానీ సినిమా సేఫ్ జోన్ కు రాదు. వీక్ డేస్ మొదలయ్యాక సినిమా పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడే చెప్పలేం. సోమవారం టెస్ట్ పాస్ అయితేనే సీటీమార్ సినిమా సేఫ్ అవుతుందా..? లేదా..? అనేది తెలుస్తుంది. అప్పటి వరకు టెన్షన్ తప్పదు. మొత్తానికి ఇప్పటికైతే వీకెండ్ టెస్ట్ పాస్ అయిన సీటీమార్.. వీక్ డేస్‌లో వీక్ అవ్వకపోతే అప్పుడు నిలబడినట్టు.

ఇవి కూడా చ‌ద‌వండి..

Love Story: హృద్యంగా ఉన్న ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్..!

Sampath Nandi| సీటీమార్ డైరెక్ట‌ర్ తో చిరంజీవి సినిమా..?

Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana