శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 21:32:44

సినిమా టికెట్ ధ‌ర‌ల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?

సినిమా టికెట్ ధ‌ర‌ల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?

ఒకప్పుడు సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న ధరలతో పాటు సినిమా టికెట్ రేట్లు కూడా బాగానే పెరిగాయి. పదేళ్ల కింద మినిమం టికెట్ ₹10 రూపాయలు ఉండేది. హైయెస్ట్ వికెట్ ₹100. కానీ తర్వాత తర్వాత మెల్లగా టికెట్ రేట్లు పెరుగుతూ వచ్చాయి. 10 రూపాయల టికెట్ కాస్త 20 కి చేరింది. సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయల టిక్కెట్టు 120 రూపాయలు అయింది. మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు. చాలా రోజుల నుంచి 150 రూపాయల దగ్గరే టికెట్ రేట్లు ఆగిపోయాయి. కొత్త సినిమా విడుదలైనప్పుడు మాత్రం కాస్త పెంచుకుంటారు. మధ్యలో కొన్ని సార్లు టికెట్ రేట్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా కెసిఆర్ సర్కార్, అటు జగన్ సర్కార్ దీనికి నో చెప్పారు. సామాన్య ప్రేక్షకుడికి కూడా సినిమా అందుబాటులో ఉండాలని టికెట్ రేట్లు పెంచలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 

కరోనా వైరస్ కారణంగా దాదాపు పది నెలలు థియేటర్లు మూత పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా థియేటర్లు శాశ్వతంగా మూత పడ్డాయి. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3000 థియేటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 1800కి పడిపోయింది. ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. అయితే చాలా నెలల తర్వాత థియేటర్ వైపు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ రేట్లు షాక్ ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్స్ లో ₹100 రూపాయల టికెట్ 150 రూపాయలు చేశారు. అలాగే మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఒక సినిమాకు దాదాపు 220 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఇది రిక్లైనర్ (పడుకొని చూసే సీట్లు) 350 రూపాయలు. 

సింగిల్ స్క్రీన్ లో అయితే 172 రూపాయలు వసూలు చేస్తున్నారు. మినిమం టికెట్ 50 రూపాయలు చేశారు. ఇలా ప్రతి థియేటర్ లో ఇదే పరిస్థితి. దాంతో చాలామంది థియేటర్ వైపు వెళ్లాలి అంటేనే భయపడుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే టికెట్స్ కోసమే దాదాపు 1000 రూపాయల ఖర్చు పెట్టాలి. అంత భారం ఒక సామాన్య ప్రేక్షకులు మోయగలడా అనేది ఇప్పుడు అందరి మదిలోనూ వస్తున్న అనుమానం.


మరోవైపు నెలకు 120 రూపాయలు చెల్లిస్తే ఓటీటీ సినిమాలు చూడొచ్చు. అమెజాన్, ఆహా, netflix ఇలా చాలా వాటిలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్ల వైపు కాకుండా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ విడుదలయ్యే వరకు కూడా మళ్ళీ అంత క్రౌడ్ పుల్లింగ్ సినిమా లేదు. జనాలు ఒక్క సినిమా కోసం ₹200 రూపాయలు పెట్టి థియేటర్ వైపు అడుగులు వేసేలా చేసే సినిమాలు ఇప్పుడు లేవు. దాంతో టికెట్ రేట్స్ పై నిర్ణయం ఏదో ఒకటి తీసుకోవాలి అని నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!


సూర్య సినిమాకు అవమానం జ‌రిగిందా..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo