ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే అతడు సీట్ బెల్టు పెట్టుకోవడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. కానీ కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ముందు నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.
అక్కడే మూడు రోజులుగా చికిత్స పొందుతున్నాడు.ల్ కత్తి మహేష్. కత్తి మహేశ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆయనకు ఎడమ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన మేనల్లుడు కూడా మీడియాకు చెప్పాడు. ఇదిలా ఉంటే జూన్ 28 సాయంత్రం కత్తి మహేష్ కు ఒక మేజర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. కంటితో పాటు ముక్కులోని ఎముకలు పూర్తిగా చిధ్రం అయిపోవడంతో వైద్యులు వాటికి రీ కన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నారు. దీని కోసం చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. కంటి ఆపరేషన్ ఇప్పటికే పూర్తయింది.
దాంతో పాటు కత్తి మహేష్ శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడిన కూడా జీవితాంతం ఈ దీర్ఘకాలిక సమస్యలతో ఆయన బాధపడక తప్పదు అంటూ వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అన్నింటి కంటే ముఖ్యంగా ఇప్పటికీ ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ముక్కు తీవ్రంగా దెబ్బతినడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోయినా కూడా కత్తి మహేష్ మామూలు మనిషి కావడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ఈయనకు మరికొన్ని సర్జరీలు కూడా చేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన సన్నిహితులు మాత్రమే సోషల్ మీడియా వేదికగా చెబుతామని తెలియజేశారు. తాము అధికారికంగా చెప్పే వరకు ఎలాంటి పుకార్లను నమ్మవద్దు అంటూ వాళ్ళు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు అయిన స్పృహలోకి రాలేదు.
ఇవి కూడా చదవండి..
‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్..ఫస్ట్ లుక్
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com