బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 21:03:54

బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ కథేంటి..?

బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ కథేంటి..?

బిగ్ బాస్ వీకెండ్ వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది చాలా కామన్ విషయం. ఎవరో ఒకరు కచ్చితంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇప్పటికే 12 వారాలు పూర్తి కావడంతో మరో నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో టాప్ 7 ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. అందులో హారిక, అభిజీత్, సోహైల్ సేఫ్ జోన్‌లో ఉండగా.. అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. వీళ్లలో ఎవరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారిన విషయం. ఆదివారం ఎపిసోడ్ శనివారమే పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ వారం ఎవరు బయటికి వెళ్తారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. నామినేషన్స్‌లో ఉన్న అఖిల్, మోనాల్‌కు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఈ ఇద్దరూ చాలా ఈజీగా సేఫ్ అయిపోయినట్లు తెలుస్తుంది. 

మరోవైపు అరియానా, అవినాష్ మాత్రమే డేంజర్ జోన్‌లో ఉండిపోయారు. ఇందులో మళ్లీ అవినాష్ కంటే అరియానకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఈ వారం ఈమె కూడా సేఫ్ అయిపోయింది. నలుగురిలో అవినాష్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఈ వారం నామినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ తమను తాము సేవ్ చేసుకోడానికి బిగ్ బాస్ మరో అవకాశం కూడా ఇచ్చాడు. ఆ క్రమంలోనే అవినాష్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. అంటే నామినేషన్ నుంచి కానీ ఎలిమినేషన్ నుంచి కానీ తనను తాను కాపాడుకోవడం అన్నమాట. దాంతో ఈ వారం ఎలిమినేట్ కావడంతో ఆ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్. 

అలా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేదు. ఉన్నా పనికిరాలేదు.. ఇంటి నుంచి ఎవరూ బయటికి పోలేదు. అప్పట్లో అమ్మ రాజశేఖర్‌ను ఎలాగైతే ఎలిమినేట్ చేసి చివరి నిమిషంలో సేవ్ అన్నారో.. ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా పాస్ పుణ్యమా అని ఇంట్లోనే ఉంచేసారు. ఆ తర్వాత నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్‌ను చూపించబోతున్నారు. మొత్తానికి టాప్ 5లో నుంచి ఇద్దరు బయటికి వచ్చి.. ముగ్గురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo