మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 20:42:58

ఇంట్లోనే ఉన్నాం..కానీ క‌రోనా మా ఇంటికొచ్చింది

ఇంట్లోనే ఉన్నాం..కానీ క‌రోనా మా ఇంటికొచ్చింది

క‌రోనా మ‌హమ్మారి ఎప్పుడు, ఎలా, ఎవ‌రికి సోకుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సామాన్యులు, సెల‌బ్రిటీలు, పేద, ధ‌నిక అనే తేడా లేకుండా క‌రోనా వ‌స్తోంది . ఇప్ప‌టికే చాలా మంది సినీ తార‌ల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ కాగా..కొంత‌మంది ఇప్ప‌టికే కోలుకుని, మాన‌సికంగా ధైర్యంగా ఉంటే క‌రోనాను జ‌యించ‌వ‌చ్చ‌ని సందేశం అందించారు. తాజాగా ప్ర‌ముఖ గాయ‌ని స్మితకు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్మిత ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకుంది. 

నిన్న నాకు కొన్ని ఒళ్లునొప్పులుండ‌గా..విశ్రాంతి లేకుండా ప‌నిచేయ‌డం ద్వారానే ఇలా అయింద‌నుకున్నా. ఎందుకైనా మంచిద‌ని ప‌రీక్ష చేయించుకున్నా. నా భ‌ర్త శ‌శాంక్‌, నాకు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. కోవిడ్‌-19ను జ‌యించి, ప్లాస్మా దానం చేసేందుకు ఎదురుచూస్తున్నా. మేం ఇంట్లోనే ఉన్నాం..సుర‌క్షితంగా ఉన్నాం. కానీ క‌రోనా మా ఇంటికి వ‌చ్చిందని ట్వీట్ చేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo