మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 20:01:09

రేపు పెద్ద స‌ర్ ఫ్రైజ్ ఉంద‌న్న‌ పూజాహెగ్డే..వీడియో

రేపు పెద్ద స‌ర్ ఫ్రైజ్ ఉంద‌న్న‌ పూజాహెగ్డే..వీడియో

టాలీవుడ్ స్టార్లు ప్ర‌భాస్-పూజాహెగ్డే కాంబినేష‌న్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ప్రాజెక్టు రాధేశ్యామ్‌. రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ట‌ర్. ఈ మూవీ నుంచి వ‌స్తున్న ఒక్కో అప్ డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజాగా అందాల భామ పూజాహెగ్గే సెట్స్ లో నుంచి ఓ వీడియో తీసి ట్విట‌ర్ లో పోస్ట్ చేసింది. అంద‌రికీ హాయ్‌...నేను రాధేశ్యామ్ లో సెట్ లో ఉన్నాను. మీ కోసం పెద్ద స‌ర్ ఫ్రైజ్ రేపు మీ ముందుకు రాబోతుంది. అప్ప‌టివ‌ర‌కు వేచి ఉండండి అంటూ సెట్స్ లో తీసిన వీడియోను యూవీ క్రియేష‌న్స్ ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

మీ అంద‌రిలాగే పుట్టిన‌రోజు వ‌ర‌కూ మా ఎక్స‌యిట్ మెంట్ ను ఆపుకోలేం. దీన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్దాం. రేపు రాబోయే దాని గురించి ఏంటీ..? వేచి ఉండండి.అంటూ ట్వీట్ చేసింది యూవీ క్రియేష‌న్స్.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.