ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 16:05:01

అరెస్ట్ చేయ‌కుండా ఆప‌లేం.. తాండ‌వ్ మేక‌ర్స్‌కు సుప్రీం షాక్‌

అరెస్ట్ చేయ‌కుండా ఆప‌లేం.. తాండ‌వ్ మేక‌ర్స్‌కు సుప్రీం షాక్‌

న్యూఢిల్లీ: అమెజాన్ వెబ్ సిరీస్ తాండ‌వ్ మేక‌ర్స్‌, యాక్ట‌ర్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. మిమ్మ‌ల్ని అరెస్ట్ చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేము అని తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ సెక్ష‌న్ 482 కింద మేము మా అధికారాన్ని ఉప‌యోగించ‌లేము. మ‌ధ్యంత‌ర ర‌క్ష‌ణ‌ను మేము క‌ల్పించ‌లేము అని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఆరు రాష్ట్రాల్లో తాండ‌వ్ వెబ్ సిరీస్‌పై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల పోలీసులు త‌మ‌ను అరెస్ట్ చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఈ సిరీస్ మేక‌ర్స్‌, యాక్టర్స్ కోర్టును ఆశ్ర‌యించారు. 

దీనిపై జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, జ‌స్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జ‌స్టిస్ ఎంఆర్ షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా.. మీ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ హ‌క్కును మీరు దుర్వినియోగం చేయ‌కూడ‌దు. ఓ వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే పాత్ర‌ను మీరు చిత్రించ‌కూడ‌దు అని కోర్టు స్ప‌ష్టం చేసింది. అరెస్ట్ భ‌యంతో న‌టుడు జీషాన్ ఆయుబ్‌, అమెజాన్ క్రియేటివ్ హెడ్ అప‌ర్ణ పురోహిత్‌, సిరీస్ మేక‌ర్ హిమాన్షు కిష‌న్ మెహ్రా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌పై దాఖ‌లైన అన్ని క్రిమిన‌ల్ కేసుల‌ను క‌లిపి ముంబై కోర్టుకు బ‌దిలీ చేయ‌మ‌ని కూడా వీళ్లు కోరారు. 

VIDEOS

logo