శుక్రవారం 10 జూలై 2020
Cinema - May 27, 2020 , 17:20:36

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. నిర్మాతలు సీ కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్ శంకర్, మా అద్యక్షుడు నరేష్, FDC మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.


లాక్ డౌన్ తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు  నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.  షూటింగ్ లు, దియేటర్స్ ఓపెనింగ్ లకు సంబంధించి పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుందని మంత్రి తెలిపారు.


logo