శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 08, 2021 , 10:03:40

సుంద‌ర్ అర్ధ సెంచ‌రీ, భార‌త్ 289/6

సుంద‌ర్ అర్ధ సెంచ‌రీ, భార‌త్ 289/6

చెన్నై చెపాక్ స్టేడియంలో  ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి ఆడ‌గా, మ‌నోళ్లు తెలిపోయారు. ఆదివారం రోజు తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ 578 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌గా పెవీలియ‌న్ చేర‌డంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డిన‌ట్టు కనిపించింది. చక్కటి షాట్లతో కాసేపు అలరించిన శుభ్‌మన్‌ గిల్‌ (29) కూడా త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత కోహ్లీ, అజింక్యా ర‌హేనే వెంట వెంట‌నే త‌మ వికెట్స్ కోల్పోవ‌డంతో 73/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.

టాపార్డర్‌ విఫలమైనా మ‌రోసారి పుజారా, పంత్ అద్భుత‌మైన ఆట‌తో ఇన్నింగ్స్ కుప్ప‌కూల‌కుండా అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించాక పుజారా ఔటయ్యాడు. పంత్‌ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వ‌‌చ్చిన  అశ్విన్(16)‌, సుందర్  17.2 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి   మరో వికెట్‌ పడకుండా  మూడో రోజును ముగించారు. ఇక ఓవ‌ర్ నైట్ స్కోరు  257/6 తో సోమ‌వారం ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన భార‌త్ దూకుడుగా ఆడుతుంది. ఈ క్ర‌మంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్(57) త‌న కెరీర్‌లో రెండో అర్ద సెంచ‌రీ న‌మోదు చేశాడు. ప్ర‌స్తుతం భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగులు చేయ‌గా, ఫాలో ఆన్ త‌ప్పించుకోవాలి అంటే మ‌రో 90 ప‌రుగులు చేయాల్సి ఉంది. 

VIDEOS

logo