గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 10:12:21

నిజం నిల‌క‌డ‌గా తెలుస్తుంది.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన క‌నికా

నిజం నిల‌క‌డ‌గా తెలుస్తుంది.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన క‌నికా

బాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో న‌మోదైన తొలి క‌రోనా పాజిటివ్ కేసు క‌నికాదే. మార్చి 9న లండన్ నుంచి వచ్చిన ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని ఒక హోటల్లో బస చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో అంద‌రు ఉలిక్కిప‌డ్డారు. బాధ్య‌త‌రాహిత్యంగా ప్ర‌వ‌ర్తించిన క‌నికాని కఠినంగా శిక్షించాలని అన్నారు. అంతేకాదు ఆమెపై లేని పోని ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో క‌నికా అస‌లు నిజం నిరూపిత‌మ‌వ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొంది.  

నేను సైలెంట్‌గా ఉండ‌డం వ‌ల‌న పుకార్ల‌కి ఆజ్యం పోసిన‌ట్టు అయింది. మార్చి 10న నేను లండ‌న్ నుండి ముంబైకి ప్ర‌యాణించాను. ఆ రోజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్స్‌లో స్క్రీనింగ్ జ‌రిపారు. నాకు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఏవి క‌నిపించ‌క‌పోవ‌డంతో క్వారంటైన్‌లో ఉండాల‌ని అనుకోలేదు. ఈ క్ర‌మంలో మార్చి 11న ల‌క్నోలో నా ఫ్యామిలీని క‌ల‌వ‌‌డానికి వెళ్లాన‌ని క‌నికా చెప్పుకొచ్చింది.

ఆ రోజు డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఎలాంటి స్క్రీనింగ్ జ‌ర‌ప‌లేద‌ని చెప్పుకొచ్చిన క‌నికా మార్చి 14,15 తేదీల‌లో ఫ్రెండ్స్ ఇచ్చిన లంచ్, డిన్న‌ర్ పార్టీకి హాజ‌రైంది. ఆ స‌మ‌యంలో నేను ఏ పార్టీ జ‌ర‌ప‌లేదు. మార్చి 17,18 తేదీల‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు కాస్త క‌నిపించ‌డంతో మార్చి 19న టెస్ట్ చేయించుకున్నాను. మార్చి 20న క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు.  వెంట‌నే ఆసుప‌త్రిలో చేరాను. 21 రోజుల ఐసోలేష‌న్ త‌ర్వాత డిశ్చార్జ్ అయ్యాను.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్స్‌, న‌ర్సులతో పాటు న‌న్ను కంటికి రెప్ప‌లా చూసుకున్న వైద్య సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను. ఇలాంటి విష‌యాల‌ని అంద‌రు నిజాయితీగా, సున్నిత‌త్వంతో డీల్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అని క‌నికా పేర్కొంది.  


logo