ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 09:51:50

వెల్‌డ‌న్ అల్లు అర్జున్ అంటూ డేవిడ్ వార్న‌ర్ పోస్ట్

వెల్‌డ‌న్ అల్లు అర్జున్ అంటూ డేవిడ్ వార్న‌ర్ పోస్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజిక‌ల్‌గాను ఎంతో అల‌రించింది. ముఖ్యంగా థ‌మ‌న్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన బుట్ట బొమ్మ అనే సాంగ్  అనేక రికార్డులు కూడా న‌మోదు చేసింది. క్రికెట‌ర్స్ డేవిడ్ వార్న‌ర్, కెవిన్ పీట‌ర్స‌న్‌లు కూడా ఈ సాంగ్‌కి ఫిదా కావ‌డ‌మే కాకుండా స్టెప్పులేసి అల‌రించాడు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో డేవిడ్ వార్న‌ర్ సౌత్ సినిమాల‌కు సంబంధించిన చాలా సాంగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేశాడు.ఇందులో భాగంగా బుట్ట‌బొమ్మ సాంగ్‌కి ప‌లుమార్లు స్టెప్పులేసి అల‌రించాడు. అయితే తాజాగా ఈ సాంగ్ 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా డేవిడ్ వార్నర్ బన్నీకు తన ఇన్స్టా ద్వారా వెల్డన్ అంటూ స్టేటస్ పెట్టారు.  వార్న‌ర్ నుండి బన్నీకు మ‌రోసారి విషెస్ అంద‌డంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా, డేవిడ్ వార్న‌ర్ భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న స‌మారానికి సిద్ద‌మ‌వుతున్నాడు.