గురువారం 04 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 21:22:51

వ‌రంగ‌ల్ అమ్మ‌డి గ్లామ‌ర్‌కు ఫిదా అవ్వాల్సిందే

వ‌రంగ‌ల్ అమ్మ‌డి గ్లామ‌ర్‌కు ఫిదా అవ్వాల్సిందే

కాలేజ్ డేస్‌లో మోడ‌ల్‌గా పనిచేసి ఆ తర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది వ‌రంగ‌ల్ అమ్మ‌డు ఈషారెబ్బా. చిన్న పాత్ర‌లు చేసుకుంటూ లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగి.. ప‌లు చిత్రాల‌తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలుకరించింది. ఈ భామ ప్ర‌స్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంలో న‌టిస్తోండ‌గా..త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. ఈ బ్యూటీ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది.


యెల్లో మినీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. మ‌త్తెక్కించే చూపుతో, మంత్ర‌ముగ్దుల్ని చేసే అందంతో బాత్‌ట‌బ్‌లో ఉండి షూట్‌లో పాల్గొన్న‌దీ భామ‌. ఈషారెబ్బా లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo