ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 17:50:31

ఎనిమిదేండ్ల త‌ర్వాత టాలీవుడ్ కు రీఎంట్రీ

ఎనిమిదేండ్ల త‌ర్వాత టాలీవుడ్ కు రీఎంట్రీ

2012లో మారుతి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ రోజుల్లో, బ‌స్ స్టాప్ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వ‌రంగ‌ల్ బ్యూటీ ఆనంది. లోబడ్జెట్ సినిమాగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. న‌టిగా ఆనందికి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చినా ఆనంది మాత్రం త‌మిళ చిత్రాల‌పై ఫోక‌స్ పెట్టింది. కొన్నాళ్లుగా త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ భామ సుమారు ఎనిమిదేండ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ఆడియెన్స్ ను ప‌లుక‌రించేందుకు రెడీ అవుతోంది.

ప్ర‌స్తుతం జాంబిరెడ్డి చిత్రంలో న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణ్ కుమార్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు న‌టిస్తోన్న శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాలో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. ఈ చిత్రాన్ని విజ‌య్ ఛిల్లా-శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే షురూ కానుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo