శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 00:03:24

సంక్రాంతికి క్రాక్‌

సంక్రాంతికి క్రాక్‌

రవితేజ, శృతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు రాష్ర్టాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది.  నీతి, నిజాయితీలకు కట్టుబడి జీవించే ఓ పోలీస్‌కు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా రవితేజ కనిపిస్తారు. మాస్‌ కోణంలో వైవిధ్యంగా ఆయన పాత్ర సాగుతుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌, సుధాకర్‌ కొమాకుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌, సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు.