టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో ఛత్రపతి తప్పక ఉంటుంది. ప్రభాస్ పర్ఫార్మెన్స్, రాజమౌళి డైరెక్షన్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు . పెన్ స్టూడియోస్ లో నిర్మితం అవుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు.
బెల్లంకొండకు హిందీలో క్రేజ్ బాగానే ఉంది. అందుకే పెన్ స్టూడియోస్ వారు ఛత్రపతి రీమేక్‌ని తమ దగ్గరకు తీసుకొచ్చారని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒరిజినల్ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ చేత రైటింగ్ కోసం సహాయం కూడా తీసుకుంటామని చెప్పిన వినాయక్ అలాగే రాజమౌళితో కూడా చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మరోసారి వినాయక్-రాజమౌళి చర్చలు జరపనున్నారు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్‌కి హిందీ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పెన్ సాయం తీసుకోవడానికి సిద్ధమైంది చిత్ర బృందం.