బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 18:26:08

చిరంజీవి పిలుపు తో విశ్వ‌క్ సేన్ ర‌క్త‌దానం

చిరంజీవి పిలుపు తో విశ్వ‌క్ సేన్ ర‌క్త‌దానం

హైద‌రాబాద్ : ర‌క్త‌దానం చేసేందుకు ముందుకు రావాల‌ని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞ‌ప్తి మేర‌కు టాలీవుడ్ న‌టుడు విశ్వ‌క్ సేన్ ముందుకొచ్చాడు. త‌ల‌సేమియా వ్యాధిగ్ర‌స్తులు, గ‌ర్భిణీ స్త్రీలు, ఎమ‌ర్జెన్సీ లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు విశ్వ‌క్ సేన్ త‌న వంతుగా ..చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కు వెళ్లి ర‌క్త‌దానం చేశాడు. విశ్వ‌క్ సేన్ ర‌క్త‌దానం చేస్తున్న ఫొటోల‌ను బీఏ రాజు ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. 

లాక్ డౌన్ నేపథ్యం లో ఆస్ప‌త్రులు, బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి చిరంజీవి ముందుకొచ్చి..ఇటీవల రక్తదానం చేసి, తన అభిమానులకు, ఇతర సినిమా తారలకు రక్తదానం చేయాలంటూ పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo