ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 22:17:27

మోసగాడి కథ

మోసగాడి కథ

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.  జూన్‌ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇంగ్లీష్‌ వెర్షన్‌ను జూలైలో విడుదల చేస్తారు. ‘ఒక ఐటీ కంపెనీలో జరిగిన ఫ్రాడ్‌ నేపథ్యంలో జరిగే కథ ఇది. విష్ణు పాత్ర చిత్రణ నెగెటివ్‌ షేడ్స్‌లో సాగుతుంది. ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది’ అని చిత్రబృందం పేర్కొంది.


logo