ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 15:26:13

విశాల్‌, ఆర్య కాంబినేష‌న్‌లో బ‌డా చిత్రం..!

విశాల్‌, ఆర్య కాంబినేష‌న్‌లో బ‌డా చిత్రం..!

త‌మిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య గ‌తంలో వాడు వీడు అనే సినిమాలో క‌లిసి న‌టించి బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఇందులో ప‌ల్లెటూరి మొర‌టోళ్ళుగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి విశాల్‌, ఆర్య క‌లిసి న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ చిత్రంలో విశాల్ హీరోగా న‌టిస్తుండ‌గా, ఆర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం.  'గద్దలకొండ గణేష్‌' సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. నేటి నుండి ఈ చిత్రం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ వెల్ల‌డించ‌నున్నారు. కాగ, విశాల్ .. తుప్పరివలన్ 2 సహా రెండు చిత్రాలు చేస్తున్నారు.  ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన 'చక్ర' చిత్రం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. 


logo