శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 09:06:35

మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్..!

మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్..!

ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. త‌మిళ హీరోలు విశాల్‌, ఆర్య క‌లిసి భారీ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.గ‌తంలో వాడు వీడు అనే సినిమాలో క‌లిసి న‌టించి బాక్సాఫీస్ ని షేక్ చేసిన వీరు ఇందులో ప‌ల్లెటూరి మొర‌టోళ్ళుగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ఇప్పుడు  విశాల్ హీరోగా న‌టిస్తుండ‌గా, ఆర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం.  'గద్దలకొండ గణేష్‌' సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. 

హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి మేక‌ర్స్ ఎనిమి అనే టైటిల్ ప్ర‌క‌టించారు. బుధ‌వారం సాయంత్రం టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి విశాల్‌ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీని తర్వాత విశాల్‌ 'డిటెక్టివ్‌2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. విశాల్  న‌టించిన 'చక్ర' చిత్రం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. 


logo