సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 11:26:28

క‌రోనా: ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన విరాట‌ప‌ర్వం న‌టి

క‌రోనా: ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన విరాట‌ప‌ర్వం న‌టి

రానా, సాయిపల్లవి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి, జ‌రీనా వ‌హాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు  డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి మూవీని నిర్మిస్తున్నారు. అయితే .1970వ దశకంలో పలు సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన జ‌రీనా వ‌హాబ్‌కు(61) క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు. 

జరీనా ప్ర‌స్తుతం శ్వాస స‌మ‌స్య , కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ , అలసట మరియు జ్వరాలతో సహా ప‌లు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతోంది. ఆమెలో ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ త‌క్కువ ఉన్న‌ట్టు గుర్తించిన వైద్యులు వెంటిలేట‌ర్‌పై ఉంచారు. ప్ర‌స్తుతం ఆమె క్షేమంగానే ఉన్నార‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని చెబుతున్నారు. జ‌రీనా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల చలనచిత్రాలలో నటించింది. 1986లోఆదిత్య పంచోలిని జరీనా  వివాహం  చేసుకోగా, వీరికి సన అనే కూతురు, సూరజ్ పంచోలి అనే కొడుకు ఉన్నారు. 


logo