సినీ పరిశ్రమకు వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోల, నిర్మాతలు, దర్శకుల ఫ్యామిలీకి సంబంధించి ఎంతో మంది వచ్చారు. తాజాగా ఒకప్పటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ త్వరలో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. ఈ రోజు విరాట్ రాజ్ బర్త్ డే సందర్భంగా అతని మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆయన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ పోస్టర్ విడుదల చేసి ఆశీస్సులు అందించారు.
విరాట్ రాజ్ నటిస్తున్న చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’కాగా, విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్ మరో ప్రచార చిత్రం లో గన్ చేతబట్టి కనిపిస్తున్నారు.
ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు ‘విరాట్ రాజ్’
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్స.కె. మాట్లాడుతూ…’హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం” అని తెలిపారు.
సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి భారీ సినిమాలు కె.జి.ఎఫ్. 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్రుర్’ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు