అలనాటి సినీయర్ కథానాయకుడు హరనాథ్ సోదరుడు వెంకట్ సుబ్బరాజు మనువడు విరాట్రాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సీతామనోహర శ్రీరాఘవ’. దుర్గా శ్రీ వత్సస.కె దర్శకుడు. సుధాకర్ నిర్మాత. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రుర్