ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 00:15:36

ఓడిపోతే తట్టుకోలేడు!

ఓడిపోతే తట్టుకోలేడు!

  • బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క

శర్మకు హాస్యచతురత కాస్త ఎక్కువ. వ్యంగ్యంతో కూడిన ఛలోక్తులు విసురుతూ ఎదుటివారిని  నవ్వించే ప్రయత్నం చేస్తుందీ అమ్మడు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. ముఖ్యంగా టీం ఇండియా సారథి, భర్త విరాట్‌కోహ్లిని ఉద్దేశిస్తూ అభిమానులు ఎక్కువగా ప్రశ్నలడిగారు. విరాట్‌కు బాగా కోపం తెప్పించే విషయమేమిటో చెప్పమని ఓ అభిమాని ప్రశ్నించినప్పుడు..‘ఇంట్లో కూర్చుని ఆడుకునే చిన్న చిన్న బోర్డ్‌ గేమ్స్‌లో కూడా ఓడిపోవడం విరాట్‌కు ఇష్టం ఉండదు. ఫలితం తనకు అనుకూలంగా లేకపోతే చిన్నబుచ్చుకుంటాడు. కోపంగా మారిపోతాడు. అలాంటి సమయాల్లో నేనే అతన్ని ఏదోలా నవ్వించే ప్రయత్నం చేస్తాను’ అని చెప్పింది. ఇంటిపనుల్లో విరాట్‌ సహాయం తీసుకుంటారా అని అడగ్గా...ఏదైనా బాటిల్‌ మూత బాగా బిగుసుకు పోయినప్పుడు ఓపెన్‌ చేయడానికి విరాట్‌నే పిలుస్తా. బాగా బరువు ఉన్న కుర్చీలను ఎత్తే విషయంలో కూడా విరాట్‌ సహాయం తీసుకుంటా’ అని సరదాగా వ్యాఖ్యానించింది. తాను నటించే సినిమాల్ని విరాట్‌ ఓ ప్రేక్షకుడి కోణంలోనే చూస్తాడని, నటనలోని లోపాల్ని చక్కగా విశ్లేషిస్తాడని అనుష్కశర్మ పేర్కొంది.  ఈ జంట ముంబయిలోని స్వగృహంలో లాక్‌డౌన్‌ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం అనుష్కశర్మ కొన్ని వెబ్‌సిరీస్‌ల నిర్మాణ బాధ్యతలతో బిజీగా ఉంది.


logo