శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 01, 2020 , 14:00:55

బార్బ‌ర్‌గా మారిన విష్ణు భార్య‌.. వీడియో!

బార్బ‌ర్‌గా మారిన విష్ణు భార్య‌.. వీడియో!

లాక్‌డౌన్ వ‌ల‌న సెలూన్స్ అన్నీ మూత ప‌డ్డాయి. దీంతో కొంద‌రు దేవ‌దాసుల్లా జుట్టూ గ‌డ్డాలు పెంచేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఇంట్లో వారితో క‌టింగ్ చేయించ‌కోవ‌డం లేదంటే తామే చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు భార్య విరానిక బార్బ‌ర్ అవాత‌ర‌మెత్తి త‌న త‌న‌యుడి‌కి హెయిర్ క‌ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 

లాక్‌డౌన్ వ‌ల‌న విదేశాల‌లో ఉన్న విరానిక‌.. త‌న‌యుడు అవ్ర‌మ్‌కి హెయిర్ బాగా పెరిగిపోవ‌డంతో తానే ట్రిమ్మ‌ర్‌తో హెయిర్ క‌ట్ చేసింది. బుడ్డోడి చేతిలో ట్యాబ్ పెట్టి హెయిర్ క‌ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, ప‌దే ప‌దే వెనక్కి తిరిగి వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియోపై స్పందించిన హ‌న్సిక‌.. ‘సో క్యూట్‌ విన్నీ’ అని కామెంట్‌ చేశారు.  logo