ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 17:17:36

ది గ్రేట్ ఖ‌లీతో షారుక్‌..త్రోబ్యాక్ స్టిల్‌

ది గ్రేట్ ఖ‌లీతో షారుక్‌..త్రోబ్యాక్ స్టిల్‌

ఒక‌రు రెజ్లింగ్ లో లెజెండ్‌..ఇంకొక‌రు యాక్టింగ్ లో లెజెండ్‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే ఎలా ఉంటుంది. అభిమానుల‌కు పండ‌గే. అయితే ఇంత‌కీ ఆ ఇద్ద‌రు సెల‌బ్రిటీలు ఎవ‌ర‌నుకుంటున్నారా...?  ది గ్రేట్ ఖ‌లీ, షారుక్‌ఖాన్‌. రెజ్ల‌ర్ గా ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ది గ్రేట్ ఖ‌లీ రిటైర్మెంట్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ఫాలోవ‌ర్లంతా ఒక్కసారిగా బావోద్వేగానికి లోన‌వుతున్నారు. ఈ సందర్భంగా ప్ర‌ముఖ ప్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్ ది గ్రేట్ ఖ‌లీ త్రోబ్యాక్ స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. 

తెలుపు టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్ లో ఉన్న ఖ‌లీతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుస్తీ ప‌డుతున్న‌ట్టుగా స‌ర‌దాగా దిగిన స్టిల్ ను షేర్ చేయ‌గా..నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ది గ్రేట్ ఖ‌లీ రింగ్ ను మిస్స‌వుతున్నాడు. ఇక గొప్ప యుద్దాలు, డ్రామా చూడ‌లేమంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.  హాలీవుడ్ స్టార్ హీరో డ్వానే జాన్స‌న్, ఖ‌లీకి షేక్ హ్యాంక్ ఇస్తున్న ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.