బుధవారం 27 మే 2020
Cinema - May 12, 2020 , 09:06:12

ఆ గ్రామ‌స్థులు ఇర్ఫాన్ రుణం ఇలా తీర్చుకున్నారు..!

ఆ గ్రామ‌స్థులు ఇర్ఫాన్ రుణం ఇలా తీర్చుకున్నారు..!

విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న పేగు వ్యాధితో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం అభిమానుల‌కి, శ్రేయాభిలాషుల‌కి, కుటుంబ స‌భ్యుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఇక ఇర్ఫాన్‌తో మంచి అనుబంధం ఉన్న ఇగ‌త్ పురి గ్రామ ప్ర‌జ‌లు త‌మ ఊరి పేరు మార్చి రుణం తీర్చుకున్నారు. మహారాష్ట్రలోని ఇగత్‌పురి గ్రామంలో ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. కొద్దికాలం క్రితం ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొన్నారు. ఆ గ్రామంలోని ప్ర‌జ‌ల కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు.కంప్యూటర్లు, బుక్స్, రెయిన్ కోట్స్, పిల్లలకు స్వెటర్లు, పండుగ సమయంలో ప్రజలకు స్వీట్లు పంచడం చేశారు. ఆయ‌న సేవ‌ల‌ని మ‌న‌సులో పెట్టుకున్న ఆ గ్రామ ప్ర‌జ‌లు ఇర్ఫాన్ మ‌ర‌ణం త‌ర్వాత గ్రామానికి హీరో -చీ- వాడీ అని పేరు పెట్టుకున్నారు. మ‌రాఠీలో నైబ‌ర్ హుడ్ హీరో. ఇర్ఫాన్ ఖాన్ గురించి ఇగత్‌పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బోడ్కే స్పందిస్తూ.. మా గ్రామానికి సంర‌క్షుడిలా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న ఇర్ఫాన్ ప‌దేళ్లుగా గ్రామ ప్ర‌జ‌ల‌కి సేవ‌లందిస్తున్నారు. ఏ అవ‌స‌రం వ‌చ్చిన వెంట‌నే స్పందించేవారు. గ్రామ ప్ర‌జ‌ల‌తో ఆయ‌న‌కి మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఏ సాయం కోరినా కూడా ఆయ‌న కాద‌న‌లేదు. అలాంటి వ్యక్తి మాకు దూరం కావడం చాలా బాధగా ఉంది. మా హృద‌యాల‌లో ఇర్ఫాన్ ఎప్ప‌టికీ నిలిచిపోవాల‌ని ఊరు పేరు మార్చాం అని గోర‌ఖ్ చెప్పారు


logo