లోక నాయకుడు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ మధ్య భారతీయుడు 2 షూటింగ్ మొదలు పెట్టగా, కొద్ది రోజుల తర్వాత మూవీ చిత్రీకరణ ఆగింది. ప్రస్తుతం లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో రఫ్ లుక్ లో కనిపించారు కమల్ హాసన్. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో మూడు కోణాలలో కమల్ ఫేస్ మాత్రమే కనిపించేలా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌కి యుద్ధంతో అదిగో అదిగో వెలుగు..శబ్ధంతో అరాచకత్వం నాశనం..రక్తంతో అదిగో దొర్లుతున్న తల..ఇదిగో కనిపిస్తోంది చూడు స్వర్గం.. కంపిస్తున్న భుజం..గెలుపు నిజం అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో విలన్ గాప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
విక్రమ్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నేటి నుండి చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలియజేశారు. అలానే కమల్ హాసన్‌తో కలిసి చిత్ర బృందం కలిసి దిగిన ఫొటోలను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది విక్రమ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.