శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 18:08:12

ఇంటీరియర్‌ పనిలో విజయ్‌దేవరకొండ

ఇంటీరియర్‌ పనిలో విజయ్‌దేవరకొండ

ఇటీవల విజయ్‌దేవరకొండ ఫిల్మ్‌నగర్‌లో ఓ బంగ్లాను కొనుగోలు చేసుకుని ఓ ఇంటివాడయ్యడు. ఇటీవలే  గృహాప్రవేశం కూడా చేసుకున్న విజయ్‌ ఇప్పుడు ఇంటిని చక్కదిద్దే పనిలో వున్నాడు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో  టైం దొరకడంతో తానే దగ్గర్నుండీ ది బెస్ట్‌ డిజైన్స్‌ ను సెలె క్ట్‌ చేసుకుని ఇంటికి ఇంటీరియర్‌ వర్క్‌ చేయిస్తున్నాడు. తన అభిరుచితోపాటు తల్లిదండ్రుల టేస్ట్‌కు తగ్గట్టుగా పలు డిజైన్లతో ఇంటిని తీర్చిదిద్దే వర్క్‌లో నిమగ్నమయి వున్నాడు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వలో పాన్‌ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.  శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, మైత్రీమూవీస్‌ సంస్థలో ఓ సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్‌ అయ్యాడు. 


logo