గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 14:46:29

అల్లు అర్జున్‌కు అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చిన విజ‌య్

అల్లు అర్జున్‌కు అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చిన విజ‌య్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఇతర రాష్ట్రాల‌లోను బ‌న్నీకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళంలో బ‌న్నీని అభిమానించే వారి సంఖ్య ఎక్కువ‌నే చెప్పాలి. సెల‌బ్రిటీలు కూడా అల్లు అర్జున్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. ముఖ్యంగా మ‌న రౌడీ బాయ్ బ‌న్నీపై వీలున్న‌ప్పుడ‌ల్లా ప్రేమని క‌న‌బ‌రుస్తుంటారు.

రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీపై ఉన్న ప్రేమ‌తో స్పెష‌ల్ గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ ఏంటంటే రౌడీ వేర్ నుండి స్పెష‌ల్ గా డిజైన్ చేయ‌బ‌డ్డ  టీష‌ర్ట్‌, డిజైన్ మాస్క్‌లు, స్పెష‌ల్ ట్రాక్. వీటిని చూసి ఫిదా అయిన అల్లు అర్జున్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు థ్యాంక్స్ చెబుతూ వీటిని త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఇక వీరిద్ద‌రి సినిమాల విష‌యానికి వ‌స్తే బన్నీ త్వ‌ర‌లో పుష్ప సినిమా చేయ‌నుండ‌గా, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు


logo