శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 08:29:16

పెళ్లి పీట‌లెక్కిన టీమిండియా ఆల్‌రౌండ‌ర్

పెళ్లి పీట‌లెక్కిన టీమిండియా ఆల్‌రౌండ‌ర్

భారత క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ నేడు(గురువారం)  వైశాలి విశ్వేశ్వరన్ ను  వివాహం చేసుకున్నాడు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వైశాలిని ప‌రిణ‌య‌మాడాడు. ప్ర‌స్తుతం అత‌ని పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌ర‌పున మ్యాచ్‌లు ఆడ‌తున్న సంద‌ర్భంగా అత‌నికి స‌న్‌రైజ‌ర్స్ టీం ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్’ అంటూ విషెస్ తెలియ‌జేసిన స‌న్‌రైజ‌ర్స్   ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్  ఇవ్వ‌డం విశేషం.

ఆగ‌స్ట్‌లో విజ‌య్ శంక‌ర్, వైశాలిల నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను విజ‌య్ శంక‌ర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిందని అర్థం వచ్చేలా ఉంగరం ఎమోజి జతచేశాడు కాగా, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజ‌య్ శంక‌ర్‌కు టీమిండియా ఆట‌గాళ్లు రాహుల్, చాహ‌ల్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.


VIDEOS

logo