ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 14:40:59

లాక్‌డౌన్ ఉల్లంఘించిన హీరో.. ఎందుకో తెలుసా ?

లాక్‌డౌన్ ఉల్లంఘించిన హీరో.. ఎందుకో తెలుసా ?

ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలంటే ప్ర‌తి ఒక్క‌రు స్వీయ నియంత్ర‌ణ త‌ప్ప‌క పాటించాలని ప్ర‌భుత్వాలు, పలువురు ప్ర‌ముఖులు చెబుతున్న మాట‌. కాని కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌ని ఉల్లంఘించి బ‌య‌టకి వ‌చ్చాడు ఓ హీరో.  అత‌నెవ‌రోకాదు త‌మిళంలో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకొని ప్ర‌స్తుతం తెలుగులో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్న విజ‌య్ సేతుప‌తి. 

మ‌ధ్య త‌ర‌గతి కుటుంబం నుండి వ‌చ్చిన విజ‌య్ సేతుప‌తికి  నెల్లాయ్ భారతి అనే క్లోజ్‌ ఫ్రెండ్ ఉన్నారు. అత‌ను ర‌చ‌యిత కూడా. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఈయ‌న శుక్రవారం చెన్నైలో క‌న్నుమూశారు. ఆయ‌న చివ‌రి చూపు కోసం త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో విజ‌య్ త‌న ఇల్లు వదిలి రావ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నెల్లాయ్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన విజ‌య్ సేతుప‌తి ఆ కుటుంబానికి ధైర్యాన్ని అందించి, కొంత ఆర్ధిక సాయం చేశారు. అంత్ర‌క్రియ‌ల‌కి ఖర్చులు కూడా తానే భ‌రించాడు. స‌రైన స‌మ‌యంలో విజ‌య్ సేతుప‌తి మాన‌వ‌త్వం చూప‌డంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo