శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 08:51:54

ప్ర‌భాస్‌తో ఢీ అనేందుకు సిద్ధ‌మైన త‌మిళ హీరో

ప్ర‌భాస్‌తో ఢీ అనేందుకు సిద్ధ‌మైన త‌మిళ హీరో

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస ప్యాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన రాధే శ్యామ్ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌స్తుతం ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్, ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆది పురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.  అయితే తాజాగా స‌లార్ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిర వార్త బ‌య‌టకు వ‌చ్చింది.

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గాను అద‌రొగొడుతున్నాడు. మాస్ట‌ర్ చిత్రంలో విల‌న్‌గా న‌టించిన విజ‌య్ సేతుప‌తి ఉప్పెన చిత్రంలో కీల‌క పాత్ర‌లో మెరిసాడు. ఇక ఇప్పుడు స‌లార్‌లో ప్ర‌భాస్‌కు విల‌న్‌గా న‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ‘సలార్’ టీమ్ ఇప్పటికే విజయ్ సేతుపతిని సంప్రదించిందట. ఆయన కూడా ఓకే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ‘సలార్’ చిత్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి నుండి చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

VIDEOS

logo