శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 00:51:23

ప్రణయ తీరంలో ‘ఉప్పెన’

ప్రణయ తీరంలో ‘ఉప్పెన’

కథాంశాల ఎంపికలో కొత్తదనం.. పాత్రలపరంగా  వైవిధ్యంతో దక్షిణాదిన విలక్షణ నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం ఆయన ‘ఉప్పెన’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం విజయ్‌ సేతుపతి జన్మదినం సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి పాత్ర శక్తివంతంగా ఉంటుంది. సముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో పేద అబ్బాయికి, సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయికి నడుమ ప్రేమాయణం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే చిత్ర ఇతివృత్తం. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన గీతాలకు అద్భుత ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షామ్‌దత్‌ సైనుద్దీన్‌, ఆర్ట్‌: మౌనికరామకృష్ణ, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా.

VIDEOS

logo