శనివారం 30 మే 2020
Cinema - May 21, 2020 , 22:52:29

‘క్షత్రియపుత్రుడు’ సీక్వెల్‌లో

‘క్షత్రియపుత్రుడు’ సీక్వెల్‌లో

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన  తమిళ చిత్రం ‘తేవర్‌మగన్‌' (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) భారీ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తలైవన్‌ ఇరుక్కిరన్‌' పేరుతో ఓ సినిమాను తీయబోతున్నట్లు ఐదేళ్ల క్రితం ప్రకటించారు కమల్‌హాసన్‌. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు రూపొందించబోతున్నాయి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో విజయ్‌సేతుపతి నటించబోతున్నారు. ప్రతినాయకుడు తనయుడిగా ఆయన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల కమల్‌హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలైవ్‌లో విజయ్‌ సేతుపతి ఆయనతో ముచ్చటించారు. కమల్‌హాసన్‌ భావాలు, వ్యక్తిత్వం నచ్చి తాను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని విజయ్‌సేతుపతి తెలిపారు. ‘తలైవన్‌ ఇరుక్కిరన్‌' చిత్రంలో నేటి భారతీయ సమాజంలోని కుల, మత, ఆర్థిక, విద్యా విషయాల్ని చర్చించబోతున్నట్లు తెలిసింది. పాన్‌ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.


logo