e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోగా మారాడు. కెరీర్ మొద‌ట్లో మంచి హిట్స్ కొట్టిన విజయ్ ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల‌ని ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ఇటీవ‌ల మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాక ఎక్కువ మంది మెచ్చిన పోస్ట‌ర్‌గా రికార్డులు సాధించింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న సినిమా లైగర్. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మిలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నుండి 200 కోట్ల ఆఫర్ వ‌చ్చింద‌ని, లైగ‌ర్ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని కొంద‌రు ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ నా సినిమాకు 200 కోట్లు చాలా త‌క్కువ‌.థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసి అంత‌క‌న్నా ఎక్కువ రాబ‌డతాను అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఎట్టకేల‌కు విజ‌య్ పోస్ట్‌తో లైగ‌ర్ థియేట‌ర్స్‌లోనే విడుద‌ల కానుందని అర్ధ‌మైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
ఓటీటీలో లైగ‌ర్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ట్రెండింగ్‌

Advertisement